Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భూతవైద్యం పేరుతో యువతిపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఘటన

  • ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించిన భూత వైద్యుడు
  • బీదర్‌లోని దర్గాకు తీసుకెళ్లి పూజలు
  • ఇంటికొచ్చి యువతిపై అత్యాచారం
ఇంట్లో తిష్ట వేసిన దెయ్యాన్ని తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  బోరబండకు చెందిన దంపతులు ఇంట్లో చికాకుల కారణంగా మూడు వారాల క్రితం మల్లేపల్లికి చెందిన ఓ భూతవైద్యుడు ఆజంను కలిశారు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. దానిని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందని చెప్పాడు.

ఇందులో భాగంగా వారిని రెండుసార్లు బీదర్‌లోని ఓ దర్గాకు తీసుకెళ్లి పూజలు చేశాడు. అనంతరం బాధిత దంపతుల కుమార్తె (19)ను ఓ గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా మాట్లాడాడు. తనను పెళ్లి చేసుకోకుంటే తల్లిదండ్రులు చనిపోతారని యువతిని భయపెట్టాడు. ఈ నెల 11న బోరబండలోని యువతి నివాసానికి వచ్చిన ఆజం యువతిని వేరే గదిలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
black majic
Ameerpet

More Telugu News